ముంబయి, హైదరాబాద్ లో ఈడీ సోదాలు

ముంబయి, హైదరాబాద్ లో ఈడీ సోదాలు

Update: 2025-05-15 11:55 GMT

హైదరాబాద్ లో వైఎస్ రెడ్డి నివాసంలో 23 కోట్ల రూపాయల విలువైన నగదు, ఆభరణాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ముంబయితో పాటు హైదరాబాద్ లోనూఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబయి కార్పొరేషన్ లో పనిచేస్తున్న వైఎస్ రెడ్డి అక్రమంగా భవనాలకు అనుమతులు ఇచ్చారన్న ఆరోపణపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబయి విరార్ కార్పొరేషన్ లో పెద్దయెత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ తనిఖీలు నిర్వహిస్తుంది.

23.25 కోట్ల విలువైన...
ఈ తనిఖీల్లో వైఎస్ రెడ్డి నివాసం నుంచి 9.04 కోట్ల రూపాయల నగదుతో పాటు 23.25 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అక్రమ ఆర్జనతోనే ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము కూడబెట్టారన్న ఆరోపణలున్నాయి.


Tags:    

Similar News