Hyderabad : బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్కాడ్ సోదాలు

బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్కాడ్ సోదాలు నిర్వహిస్తుంది

Update: 2025-11-07 05:25 GMT

బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్కాడ్ సోదాలు నిర్వహిస్తుంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పెద్దయెత్తున నగదు ఉందన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్కాడ్ ఈ సోదాలను జరుపుతోంది. కూకట్ పల్ల బీఎస్పీకాలనీలోని తక్కెళ్ల పల్లి రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరుపుతుంది.

బీఆర్ఎస్ నేతల ఆందోళన...
మర్రి జనార్థన్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మర్రి జనార్థన్ రెడ్డి ఇంటి వద్ద ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. మర్రి జనార్థన్ రెడ్డిని నివాసంలోకి అనుమతించలేదని ఆయన కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంట్లో తనిఖీలు చేస్తూ తనను ఇంట్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుపడటమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి తనిఖీలు సాధారణమేనని అంటున్నారు. కానీ తమ ఇళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లేకున్నా తన అనుమతి లేకుండా సోదాలు నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News