Hyderabad ; ఎన్నికలను నిబంధనలు ఉల్లంఘించారంటూ నవీన్ యాదవ్ పై?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై ఎన్నికల సంఘం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు

Update: 2025-10-07 04:22 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై ఎన్నికల సంఘం అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తున్నారన్న కారణంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ నవీన్ యాదవ్ పై ఎన్నికల అధికారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారని ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో...
దీంతో నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు కేవలం ఫిర్యాదు మాత్రమే స్వీకరించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ముందుంది. ఆయననే అభ్యర్థిగా ప్రకటించాలని దాదాపుగా నిర్ణయించడంతో ఇప్పుడు ఈ కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ లో చర్చ జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News