Hyderabad : హైదరాబాద్ లో దీపావళికి గాయపడిన వారు ఎందరంటే?

దీపావళి పండగను వేడుకగా జరుపుకున్నారు. వేడుకలో కొందరికి గాయాలయ్యాయి

Update: 2025-10-21 02:03 GMT

దీపావళి పండగను వేడుకగా జరుపుకున్నారు. అర్ధరాత్రి దాటేంత వరకూ టపాసులు పేల్చిసంబరాలు జరుపుకున్నారు. అయితే వేడుకగా నిర్వహించిన ఈ దీపావళి పండగలో విషాదం కూడా నెలకొంది. ఎప్పటిలాగానే అనేక మంది గాయపడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. బాణాసంచా పేల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదంలో పడ్డారు. ప్రధానంగా చిన్నారులు ఎక్కువగా దీపావళి వేడుకల్లో గాయాల పాలయి ఆసుపత్రుల పాలయ్యారు. బాణాసంచా పేల్చే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించినందునే ఈ ప్రమాదాలని తొలి నుంచి చెబుతున్నా పట్టించుకోలేదు.

కంటి సంబంధిత...
బాణాసంచా కొందరికి చేతుల్లోనే పేలడంతో శరీరంపై గాయాలయ్యాయి. మరికొందరికి కళ్లలో నిప్పురవ్వలు పడి కంటి సంబంధిత వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చారు. ప్రతి ఏటా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు అనేక హెచ్చరికలు చేస్తున్నప్పటికీ టపాసులు పేల్చే ఆనందంలో వాటిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా చిన్న చిన్న ప్రమాదాలకు గురయి ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎక్కువ మంది కంటికి సంబంధిత గాయాలతో ఆసుపత్రులకు వస్తున్నారు.
సరోజినీదేవి ఆసుపత్రికి...
ప్రధానంగా మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రికి ఎక్కువ మంది టపాసులు పేలి కంటి సంబంధిత గాయాలతో ఆసుపత్రికి వచ్చారు. రాత్రి నుంచి ఇప్పటి వరకూ నలభై నుంచి యాభై మంది వచ్చినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే వారికి చికిత్స అనంతరం కొందరిని ఇంటికి పంపించివేశారు.అదృష్ట వశాత్తూ ఎవరికీ శస్త్రచికిత్సలు అవసరంలేదని సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంకా కొందరు వస్తున్నారని, వారికి పరీక్షలు జరిపి అవసరమైన చికిత్సలు అందిస్తామని చెబుతున్నారు.


Tags:    

Similar News