నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

హైదరాబాద్ లో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

Update: 2025-08-01 02:44 GMT

హైదరాబాద్ లో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో కొత్తగా 55,378 మందికి కొత్త రేషన్ కార్డులు అందనున్నాయి.

లక్షల మంది లబ్ది పొందే...
దీనివల్ల దాదాపు రెండులక్షల మంది లబ్ది పొందే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే పాత కార్డుల్లోనూ కొత్తగా అర్హులను చేర్చామని, దీనివల్ల 2.32 లక్షల మంది ప్రయోజనం పొందుతారని అధికారుల చెప్పారు. రేషన్ కార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పంపిణీ చేయనున్నారు. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు నేటి నుంచి హైదరాబాద్ వాసులకు అందనున్నాయి.


Tags:    

Similar News