Hyderabad Metro : హైదరాబాద్ వాసులకు షాకిచ్చిన మెట్రో

హైదరాబాద్ లో మెట్రో రైలులో రాయితీలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-04-07 06:04 GMT

హైదరాబాద్ లో మెట్రో రైలులో రాయితీలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. మెట్రో కార్డుపై పది శాతం రాయితీని రద్దు చేశారు. హాలిడే కార్డు కూడా రద్దయింది. మొన్నటి వరకూ సెలవు దినాల్లో యాభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే మెట్రోలో ఆరోజంతా ప్రయాణించే వీలుంది. కానీ ఈరోజు నుంచి హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మెట్రో యాజమాన్యం తెలిపింది.

రాయితీలను ...
హైదరాబాద్ లో మెట్రోను లక్షలాది మంది ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది మెట్రోలో వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. సొంత వాహనాల మీద ప్రయాణం కంటే మెట్రోలో ఏసీలో చల్లగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని భావిస్తూ అత్యధిక మంది మెట్రో రైలులోనే ప్రయాణిస్తున్నారు. సెలవుదినాల్లోనూ మెట్రో రైళ్లు ఫుల్లుగానే పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయితీలను తొలగించడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.


Tags:    

Similar News