Hyderabad : హైదరాబాద్ లో పురోహితుడికి టోకరా.. ఆరు లక్షలు కొట్టేసి
హైదరాబాద్ లో పురోహితుడిని మోసం చేసి సైబర్ నేరగాళ్లు ఆరు లక్షలు దోచుకున్నారు
హైదరాబాద్ లో పురోహితుడిని మోసం చేసి సైబర్ నేరగాళ్లు ఆరు లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం పురానాపూల్‌కు చెందిన పురోహితుడికి సికింద్రాబాద్ మిలిటరీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పిన నేరగాళ్లు తమ కల్నల్ ఆరోగ్యం బాలేదని పూజలు చేయాలని చెప్పారు. అందుకోసం పదకొండు రోజుల పూజల కోసం ఇరవై ఒక్క మంది పురోహితులు కావాలని చెప్పిన నేరగాళ్లు పురోహితుడిని ఆకట్టుకున్నారు.
పూజలు చేయాలంటూ...
మాటలతో మభ్యపెట్టారు. అడ్వాన్స్ గా మూడు లక్షలు ఇస్తామని పురోహితుడికి చెప్పిన నేరగాళ్లు బ్యాంకు ఖాతా ధృవీకరణ కోసమంటూ పది రూపాయలు పంపారు. మిగిలిన డబ్బులు పంపాలంటే డెబిట్ కార్డు, పిన్ వివరాలు చెప్పాలంటూ నేరగాళ్లు పురోహితుడికి చెప్పడంతో వాటిని పంపేశాడు. వెంటనే పురోహితుడి అకౌంట్ లో ఉన్న ఆరు లక్షల రూపాయల నగదును కొట్టేశారు. దీంతో పురోహితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.