సైబర్ క్రైమ్ పోలీసుల సరికొత్త రికార్డు

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం వారం రోజుల్లోనే పదకొండు కేసులను పరిష్కరించారని తెలిపారు

Update: 2025-11-19 12:16 GMT

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం వారం రోజుల్లోనే పదకొండు కేసులను పరిష్కరించారని తెలిపారు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నవంబర్‌ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 సైబర్‌ కేసులలో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో పలు రాష్ట్రాలకు చెందిన 18 మందిని అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో దేశవ్యాప్తంగా విస్తరించిన సైబర్‌ మోసగాళ్ల నెట్‌వర్క్‌ బయటపడిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్‌ చేసిన పద్దెనిమిది మందిలో 15 మంది ట్రేడింగ్‌ మోసాలకు సంబంధించిన వారేనని తెలిపారు. నిందితుల నుంచి 17 మొబైల్‌ ఫోన్లు, నాలుగు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసి...
యాభై మూడు కేసుల్లో కోర్టులు ఇచ్చిన రెండు వందల రిఫండ్‌ ఆర్డర్లను కూడా పోలీసులు ప్రాసెస్‌ చేసి బాధితులకు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నారు. ఒక ముఖ్య కేసులో ప్రముఖ ఫార్మా సంస్థను లక్ష్యంగా చేసుకుని నడిచిన కార్పొరేట్‌ ఎక్స్టోర్షన్‌ రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ట్రేడింగ్‌ మోసాల బృందాలపై మరింత దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News