శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా గంజాయి స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ నలభై కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తన్నారు. దీనిని హైడ్రోఫోనిక్ గంజాయిగా గుర్తించారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టకు వచ్చిన ప్రయాణికురాలి దగ్గర నుంచి ఈ నలభై కోట్ల విలువైన గంజాయిని కస్టమ్స్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు.
నలభై కోట్ల విలువైన...
40 కోట్ల రూపాయలు విలువచేసే గంజాయిని బ్యాగుల్లో తెచ్చిన ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకుని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పంపిందెవరు? ఎవరెవరికి? ఎక్కడ సప్లయ్ చేయడానికి? అన్న వివరాాలను అధికారులు మహిళ నుంచి సేకరిస్తున్నారు. మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.