నేడు కాంగ్రెస్ నిరసనల ర్యాలీ
పహల్గామ్ లో జరిగిన దాడికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలను తెలియజేయనుంది.
పహల్గామ్ లో జరిగిన దాడికి నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలను తెలియజేయనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పహల్గామ్ ఘటనను నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని పిలుపు నిచ్చింది. మృతులకు సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశాలను జారీ చేసింది.
హైదరాబాద్ లో కూడా...
దీంతో నేడు తెలంగాణలోని హైదరాబాద్ లో కూడా కొవ్వుత్తులతో కూడిన నిరసన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ చేయనుంది. పహల్గామ్ లో జరిగిన దాడికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడమే కాకుండా దేశమంతా ఐక్యంగా ఉండాలని కోరింది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఈ ఆందోళనలను నిర్వహించాలని పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు నేడు నిర్వహించనుంది.