Hyderabad : కౌంటింగ్ కు ముందు నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుండటంతో ఆయన ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు తనదేనన్న ధీమాను నవీన్ యాదవ్ వ్యక్తం చేశారు.
గెలుపు పై ధీమా...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించారని, మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని నవీన్ యాదవ్ కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేముందు నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అన్ని రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు సెంటిమెంట్ కంటే డెవలెప్ మెంట్ వైపు మొగ్గారని ఆయన అన్నారు.