Congrss : గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమయింది.

Update: 2025-11-14 07:38 GMT

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమయింది. తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్‌యాదవ్ ఇరవై మూడు వేలకిపైగా ఆధిక్యం సాధించారు. దీంతో నాంపల్లి గాంధీభవన్‌లో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపు ఏకపక్షం అంటూ నినాదాలు చేస్తున్నారు. గులాములు జరుపుకుని సంబరాలు జరుపుకుంటున్నారు.

రప్పా రప్పా అంటూ...
నవీన్‌యాదవ్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపించడంతో కార్యకర్తలు ‘కాంగ్రెస్ జిందాబాద్’ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత మెట్టు సాయి సీఎం ఏ. రేవంత్‌రెడ్డి ఫోటోతో తగ్గేదేలే.. రప్పా.. రప్పా..” అని రాసిన పోస్టర్లు తీసుకువచ్చారు. పుష్ప–2 చిత్రంలోని ప్రసిద్ధ డైలాగ్‌కు మేళవించిన ఈ పోస్టర్లు అక్కడి అందరినీ ఆకర్షించాయి. మార్ఫా బ్యాండ్‌ బీట్‌లకు కార్యకర్తలు నృత్యాలు చేస్తూ వేడుకలు నిర్వహించారు.


Tags:    

Similar News