పాలు పగిలాయని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

కూక‌ట్‌ప‌ల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రాములు అనే వ్య‌క్తి పోలీసులను ఆశ్రయించారు.

Update: 2025-06-24 10:45 GMT

కూక‌ట్‌ప‌ల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రాములు అనే వ్య‌క్తి పోలీసులను ఆశ్రయించారు. ఇంతకూ ఆయనకు ఏమి కష్టం వచ్చిందనే కదా!! ఆయన కొన్న పాలు విరిగిపోయాయి. ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్‌లో హెరిటేజ్ టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు రెండింటిని జూన్ 22న కొనుగోలు చేశారాయన. ఇంటికి వెళ్లాక అదే రోజు ఒక ప్యాకెట్‌ను ఉప‌యోగించారు. మ‌రుస‌టి రోజు జూన్ 23వ తేదీన మ‌రో ప్యాకెట్‌ను ఓపెన్ చేసి మ‌రిగించ‌గా అవి కాస్తా ప‌గిలిపోయాయి. దుర్వాస‌న కూడా రావడంతో ర‌త్న‌దీప్ సూప‌ర్ మార్కెట్‌కు వెళ్లి ప్ర‌శ్నించాడు. స్టోర్ మేనేజ‌ర్ నుండి సరైన సమాధానం రాకపోవడంతో రాముడు పోలీసులను ఆశ్రయించారు. కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌క్ష‌ణ‌మే స్పందించిన పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Tags:    

Similar News