Chiranjeevi : చిరంజీవికి అనుకూలంగా తీర్పు
మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్ లను వాడకూడదంటూ హైదరాబాద్ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది
మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటో, వాయిస్ లను వాడకూడదంటూ హైదరాబాద్ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో చిరంజీవి ఫొటోను, ఆయన పేరును వాడుకుంటూ కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ చిరంజీవి న్యాయస్థానాన్ని ఆశ్రనయించారు. దీనివల్ల తన ప్రతిష్ట దెబ్బతింటోందని తెలిపారు. దీనిపై విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తూ ఆయన పేరు, ఫొటో, వాయిస్ లను వాడుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని పోలీసులను ఆదేశించింది.
ముప్ఫయి మందికి నోటీసులు...
చిరంజీవి పేరును కొందరు కమర్షియల్ ప్రయోజనాల కోసం కూడా వినియోగిస్తుండటంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో ఆయన వాయిస్ ను కూడా వాడుకుంటున్నారని, మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో మార్ఫింగ్ చేసిన వీడియోలను ఉపయోగిస్తున్నారని, అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు వీడియోలను క్రియేట్ చేసిన ముప్ఫయి మందికి నోటీసులు జారీ చేసింది. తర్వాత విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది