Bird Flu Effect : కిలో ఇరవై రూపాయలకే చికెన్ .. మటన్, చేపల ధరలు పైపైకి
చికెన్ ధరలు పడిపోయాయి. మటన్, చేపల ధరలు అందుబాటులో లేవు
బర్డ్ ఫ్లూ భయం రెండు రాష్ట్రాలను మాంసం ప్రియులను వణికిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా సోకి లక్షల్లో కోళ్లు మరణించాయి. ఒక వ్యక్తికి కూడా బర్డ్ ఫ్లూ సోకిందని వైద్యులు నిర్ధారించడంతో చికెన్ అమ్మకాలు దాదాపుగా నిలిచిపోయాయి. హైదరాబాద్ తో పాటు విజయవాడ వంటి ప్రాంతాల్లో భారీగా చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చీప్ గా ఇస్తామన్నా కొనుగోలు చేసేవారు ముందుకు రావడం లేదు.
బర్డ్ ఫ్లూ భయంతో...
చికెన్ కొనుగోలు చేసి వంద డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉడికించి తర్వాత తింటే ఏమీ కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ చికెన్ కొనుగడోలు చేసేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో మటన్ తో పాటు చేపల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. నోటి జిహ్వను చంపుకోవడానికి మటన్ లేదా చేపలను కొనుగోలు చేయాలనుకున్న వారిని ధరలను చూసి వెనుదిరగాల్సి వచ్చింది. కిలో మటన్ ధర వెయ్యి రూపాయలకు పైగానే అమ్ముడుపోతుందని వినియోగదారులు వాపోతున్నారు.