Jubleehills By Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడంటే?
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. బీహార్ శాసనసభ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
నవంబరులోనే...
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మల్యే మాగంటి గోపీనాధ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబరులో షెడ్యూల్ విడుదలయితే బహుశ నవంబరు నెలలో ఉప ఎన్నిక జరిగే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తులు ప్రారంభించారు.