దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. "

Update: 2025-09-18 02:33 GMT

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. "దహనం" వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ పోలీసు అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో కేసు నమోదయింది. తన వెబ్ సిరీస్ లో అంజనా సిన్హా చెప్పిన విధంగానే తాను వెబ్ సిరీస్ లో సీన్లు చిత్రీకరించానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్ పై అంజనా సిన్హా పేరును ప్రస్తావించడంపై ఆమె అభ్యంతరం చెప్పింది.

అంజనా సిన్హా ఫిర్యాదుతో...
తనకు తెలియకుండా, తన పేరు వాడారంటూ అంజనా సిన్హా రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్ గోపాల్ వర్మపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఈ కేసులో నోటీసులు ఇచ్చి రాయదుర్గం పోలీసులు తొలుత విచారణ జరిపే అవకాశముందని తెలిసింది.


Tags:    

Similar News