Bus Accident : బస్సు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్దం కేసులో తల్లీకొడుకులు సజీవదహనమయ్యారు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్దం కేసులో తల్లీకొడుకులు సజీవదహనమయ్యారు.బెంగళూరుకు చెందిన తల్లి, కుమారులుర పిలోమి నాన్ బేబీ, కిషోర్ కుమార్ లు ఈ ప్రమాదంలో మరణించారు. పిలోమి నాన్ బేబీ వయసు 64 ఏళ్లు. కిషోర్ కుమార్ వయస్సు 41 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు నుంచి ఇద్దరూ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ఎక్కి బెంగళూరుకు పయనమయ్యారు.
దీపావళి పండగకు వచ్చి...
దీపావళి పండగకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెర్వులోని కృషి డిఫెన్స్ కాలనీలోని బంధువు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి రాము ఇంటికి వచ్చారు. నిన్న సాయంత్రం పటాన్ చెర్వు అంబేద్కర్ కూడలి వద్ద బస్సు ఎక్కారు. అయితే చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. హైదరాబాద్ నుంచి వారి బంధువులు ఘటన స్థలికి బయలుదేరివెళ్లారు.