Kurnool Bus Accident : హైదరాబాద్ లో ఎక్కడెక్కడినుంచి ఈ బస్సు ఎక్కారంటే?
హైదరాబాద్ నుంచి బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు బస్సు ఎక్కారు.
హైదరాబాద్ నుంచి బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో నగరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు బస్సు ఎక్కారు. బెంగళూరుకు వెళ్లేందుకు ఈ వోల్వో బస్సులో నగరంలోని వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఈ బస్సును ఎక్కినట్లు గుర్తించారు. వారిలో కూకట్ పల్లి నుండి ఆరుగురు,కుత్బుల్లాపూర్ నుండి నలుగురు, ఎస్ఆర్ నగర్ నుండి ముగ్గురు, ఎర్రగడ్డ నుండి ఇద్దరు, మూసా పేట్ నుండి ఇద్దరు, భరత్ నగర్ నుండి ఒకరు ప్రమాదానికి గురైన బస్సులో ఎక్కినట్లు తెలిసింది.
ఎక్కిన వారందరూ...
అలాగే వనస్థలిపురం నుండి ఇద్దరు ప్రయాణికులు, ప్యారడైజ్ నుండి ఇద్దరు, నాంపల్లి నుండి ఒక్కరు, లక్డీకాపూల్ నుంచి ఇద్దరు, ఎల్బీ నగర్ నుంచి ఒకరు రఈ బస్సు ఎక్కినట్లు చెబుతున్నారు. అయితే బస్సు ఎక్కిన వారు ఎవరు? వారు బతికి ఉన్నారా? గాయాలతో బయటపడ్డారా? అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ లోని వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం తో సంప్రదించి ప్రయాణికుల జాబితాను పోలీసులు తీసుకుని వారి బంధువులకు సమాచారం అందించే పనిలో ఉన్నారు.