KTR : సిట్ విచారణకు హాజరయిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. ఉదయం పదకొండు గంటలకల్లా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు కేటీఆర్ చేరుకున్నారు. ఉదయం పదకొండు గంటలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ ప్రమేయం ఉందని...
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని అనుమానించిన సిట్ అధికారులు విచారణకు రమ్మని పిలవడంతో ఆయన తరలి వచ్చారు. ఈ నెల 20వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించలేదు. కేటీఆర్ ను సాయంత్రం వరకూ విచారణ చేసే అవకాశముంది.