Breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి మృతి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణించారు. ఈరోజు ఉదయం 5.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

Update: 2025-06-08 02:33 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణించారు. ఈరోజు ఉదయం 5.45 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నెల 5వ తేదీన గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు మాగంటి గోపీనాధ్ ను ఏఐజీ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అప్పటి నుంచి అపస్మారక స్థితిలోనే మాగంటి గోపీనాధ్ ఉన్నారు. ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. మాగంటి గోపీనాధ్ మరణంతో బీఆర్ఎస్ ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయినట్లయిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

రాజకీయ ప్రస్తానం...
1983లో రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి గోపీనాధ్ ఎన్టీఆర్ హయాంలో ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988 లో హుడా డైరెక్టర్ గా పనిచేశారు. మాగంటి గోపీనాధ్ 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే రాష్ట్రం విడిపోవడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి వరసగా 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మాగంటి గోపీనాధ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని ప్రకటించారు.


Tags:    

Similar News