Breaking : నవీన్ యాదవ్ పై మాగంటి సునీత సంచలన కామెంట్స్
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన కామెంట్స్ చేశారు
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన కామెంట్స్ చేశారు. దీనిని గెలుపు అంటారని తాను అనుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసి గెలిచిందని అన్నారు. రౌడీయిజంతో కాంగ్రెస్ గెలిచిందని మాగంటి సునీత అన్నారు.గోపీనాధ్ ఉన్నప్పుడు బయటకు రాని వాళ్లు ఇప్పుడు బయటకు వస్తున్నారని, ఇది మూణ్ణాళ్ల ముచ్చటేనని మాగంటి సునీతఅన్నారు. దొంగ ఓట్లు పోల్ చేయించుకుని గెలవడం గొప్పకాదని అన్నారు.
ప్రజలను బెదిరించి...
ప్రజలను బెదిరించి ఓట్లు వేయించుకున్నారని మాగంటి సునీత ఆరోపించారు. రౌడీలకు ఓట్లు వేస్తే పాలన ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారని మాగంటి సునీత చెప్పారు. మాగంటి గోపీనాధ్ బతికి ఉన్నప్పుడు ఈ రౌడీలు దాక్కున్నారని, ఆయన మరణించిన వెంటనే కలుగుల్లో నుంచి బయటకు వచ్చారంటూ మాగంటి సునీత నవీన్ యాదవ్ పై ఫైర్ అయ్యారు.