సిట్ ఎదుటకు మాజీ మంత్రి హరీశ్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారించనున్నారు. అయితే హరీశ్ రావు వెంట ఆయన న్యాయవాది రామచంద్రరావును కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ కేసులో ఒకరు విచారణ సందర్భంగా తెలిపిన వివరాల మేరకు హరీశ్ రావుకు నోటీసులు ఇచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో...
అయితే నేడు హరీశ్ రావును కేవలం విచారించి మాత్రమే సిట్ అధికారులు వదిలేయనున్నారు. ప్రత్యేక విచారణ బృందం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్ రావు సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఒకరు వెల్లడించడం వల్లనే నేడు హరీశ్ రావును విచారణకు పిలిచామని సిట్ అధికారులు తెలిపారు.