Hyderabad : నేడు లాల్ దర్వాజా బోనాలు
హైదరాబాద్ లో నేడు ఆషాఢమాసం బోనాలు జరుగుతున్నాయి. లాల్ దర్వాజా బోనాల జాతరకు భక్తులు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
హైదరాబాద్ లో నేడు ఆషాఢమాసం బోనాలు జరుగుతున్నాయి. లాల్ దర్వాజా బోనాల జాతరకు భక్తులు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. గోల్కాండ్ జగదాంబిక అమ్మవారికి తొలి బోనాలు సమర్పించిన తర్వాత లష్కర్ బోనాలు జరిగాయి. ఈరోజు లాల్ దర్వాజా బోనాలు జరుగుతున్నాయి. ఆషాఢమాసం నాలుగో వారం కావడంతో ఈరోజు లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. గ్రామ దేవతకు పూజలు చేయడానికి, బోనాలు సమర్పించడానికి ఉదయం నుంచే బారులు తీరారు.
117 ఏళ్ల చరిత్ర కలిగిన...
హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు భక్తులు బారులు తీరారరు. లాల్ దర్వాజాలో అమ్మవారు సింహవాహినీ రూపంలో కనిపించనున్నారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కోవారంలో బోనాలు సమర్పించే సంప్రదాయం ఉండటంతో నేడు లష్కర్ బోనాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1908 నుంచి లాల్ దర్వాజా బోనాలు ప్రారంభమయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఏడాది సింహవాహినికి 117వ బోనాల ఉత్సవాలను లాల్ దర్వాజాలో నిర్వహిస్తున్నారు.