కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన దీపక్ రెడ్డి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు

Update: 2025-11-14 06:33 GMT

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. బీజేపీకి ప్రతి రౌండ్ లో అతి తక్కువ ఓట్లు వస్తుండటంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తాము ఓట్లు కొనుగోలు చేయలేదని, తమకు వచ్చిన ఓట్లన్నీ ప్రజలు స్వచ్ఛందంగా వేసినవేనని ఆయన కౌంటింగ్ కేంద్రం బయట మీడియాకు చెప్పారు.

డబ్బులు పెట్టి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఉప ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి అన్నారు. తాము సిద్ధాంతాలతోనే ముందుకు వెళతామని దీపక్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం బాగా పనిచేసిందని ఆయన అన్నారు. ఓడిపోయినా తాను ప్రజల్లో ఉండి పనిచేస్తానని బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి మీడియాకు వివరించారు.


Tags:    

Similar News