మరో వివాదంలో దివ్వెల మాధురి
బిగ్ బాస్ ఫేం దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు.
బిగ్ బాస్ ఫేం దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్ బర్త్ డే పార్టీని నిర్వహించినందుకు రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు కేసు నోమోదు చేశారు. దువ్వాడ మాధురి పుట్టిన రోజు సందర్భంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ జరిగింది. అయితే ఈ పార్టీలో విదేశీ మద్యం బాటిళ్లు, హుక్కా వంటివి ఉన్నాయన్న సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. బర్త్డే పార్టీలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్ డే పార్టీ నిర్వహించుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
బర్త్ డే పార్టీలో...
దీంతో పాటు ఈ పార్టీ ఇచ్చిన పార్ధసారధి అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు నిర్వహించి.. పార్టీని భగ్నం చేశారు. వారి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.దీంతో దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నట్లయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.