భూమిక త్యాగం ఐదుగురికి పునర్జన్మ
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ నంగి భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడింది.
భూమిక త్యాగం – ఐదుగురికి పునర్జన్మ
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ నంగి భూమిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడింది. ఈ కష్ట సమయంలోనూ ఔదార్యం చూపించిన భూమిక కుటుంబ సభ్యులు, జీవన్ దాన్ చొరవతో ఆమె అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. వారి త్యాగంతో అయిదుగురికి కొత్త జీవితం లభించడంతో, అవయవ దానానికి సంబంధించి మరింత అవగాహన పెరుగుతోంది. పుట్టెడు దుఃఖంలోనూ అద్భుతమైన మనోధైర్యాన్ని ప్రదర్శించిన భూమిక కుటుంబానికి హృదయపూర్వక సెల్యూట్!