నేటి నుంచి హైదరాబాద్ లో భారత్ సమ్మిట్
నేటి నుంచి హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ జరగనుంది
నేటి నుంచి హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ జరగనుంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. దాదాపు 450 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ కు హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని హెచ్.సి.సి. లో ఈ భారత్ సమ్మిట్ జరగనుంది. అనేక దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనడటంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా సమ్మిట్ కు రానున్నారు.
రెండు రోజుల పాటు...
దీంతో పోలీసులు ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమై సైబరాబాద్ తో పాటు హెచ్.సి.సి. ప్రాంతంలో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. రాహుల్, ఖర్గే లు కీలక ప్రసంగాలు చేయనున్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు.