Hyderabad : డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు
తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు
తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. అయ్యప్ప స్వాములతో బీజేవైఎం కార్యకర్తలు కలిసి వచ్చి ఆందోళనకు దిగారు. మాలవేసుకున్న పోలీసులను విధుల్లో ఆటంకం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై అయ్యప్పలు డీజీపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు.
పోలీసుల విధుల్లో...
అయితే డీజీపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొందరు అరెస్ట్ అరెస్ట్ అయ్యారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసుల యూనిఫాంపై ఆంక్షలు ఎందుకంటూ నిరసన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నిబంధనలు ఉన్నాయంటున్న స్వాములు ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు.