ACB : ఇప్పటి వరకూ బయటపడింది.. వంద కోట్లు అట.. ఇక ఎన్ని ఆస్తులు కనుగొంటారో?

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2024-01-24 12:02 GMT

 ACB Nalgonda raids

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మణికొండలోని ఆయన నివాసంలో పన్నెండు గంటలుగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ సోదాల్లో ఇప్పటి వరకూ వంద కోట్ల ఆస్తులు బయటపడినట్లు తెలిసంది. కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో ఆయన ఇంటితో పాటు కార్యాలయంపై ఈ రోజు ఉదయం నుంచి ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది.

రేరా సెక్రటరీగా...
ప్రస్తుతం రేరా సెక్రటరీగా బాలకృష్ణ పనిచేస్తున్నారు. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారం అనుమతులు ఇచ్చి అడ్డగోలుగా డబ్బులు దాచి పెట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. వందలకొద్దీ ప్రాజెక్టులకు ఆయన అనుమతిచ్చారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆయన ఉంటున్న విల్లా విలువే యాభై కోట్ల పై బడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని ఆస్తులు ఈ తనిఖీల్లో బయటపడే అవకాశముందని తెలుస్తోంది. ఏసీబీ దాడుల్లో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలి సారి అని అధికారులు పేర్కొంటున్నారు.


Tags:    

Similar News