నేడు హైదరాబాద్ కు అఖిలేష్ యాదవ్
నేడు హైదరాబాద్ కు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రానున్నారు.
నేడు హైదరాబాద్ కు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రానున్నారు. రెండు రోజుల పాటు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ నగరంలో ఉండనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న అఖిలేష్ యాదవ్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అధ్వర్యంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు.
రెండు రోజులు ఇక్కడే...
అఖిలేష్ యాదవ్ ఈరోజు రాత్రికి హోటల్ తాజ్ కృష్ణలో బస చేయనున్నారు. రేపు ప్రైవేటు మీటింగ్ లో పాల్గొని సాయంత్రం నాలుగు గంటలకు యూపీకి తిరుగు ప్రయాణం అవుతారు. అఖిలేష్ యాదవ్ పర్యటనకు సంబంధించి నగరంలో యాదవ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.