Hyderabad : అఖండ ఎఫెక్ట్...నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కూకట్‌పల్లి లో శుక్రవారం సాయంత్రం 4వ తేదీ నుంచి రాత్రి 11 గంటల వరకు ‘అఖండ–2’ ప్రీరిలీజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మార్గాల్లో తాత్కాలిక మార్పులు అమలు చేస్తున్నారు.
వాహనాల దారి మళ్లింపు...
భరత్ నగర్–ఎర్రగడ్డ వైపు నుంచి వచ్చిన వాహనాలను వై–జంక్షన్‌కు మళ్లించారు. భరత్ నగర్, ఎర్రగడ్డ దిశ నుంచి మూసాపేట్ జీహెచ్ఎంసీ కార్యాలయం వైపు వెళ్లే వాహనాలను కూకట్‌పల్లి వై–జంక్షన్ దిశకు మళ్లిస్తున్నారు అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. వై–జంక్షన్ నుంచి ఐడీఎల్ లేక్ రూట్‌లో మార్పు చేశారు.కూకట్‌పల్లి వై–జంక్షన్ నుంచి ఐడీఎల్ లేక్ వైపు వెళ్లే వాహనాలను జేఎన్‌టీయూ వైపు తిప్పుతున్నారు. భారీ జనసందోహం వల్ల పరిసర రూట్లలో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచించారు.