Asaduddin Owaisi : మజ్లిస్ మద్దతు ఆయనకే.. తేల్చిన అసద్
రానున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలలో తమ పార్టీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి జస్టిస్ బి. సుధర్షన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఓవైసీ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను సంప్రదించి ఎన్నికల్లో జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారని వెల్లడించారు.
తెలంగాణ ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తనతో ...
తెలంగాణ ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి తనతో మాట్లాడి జస్టిస్ సుధర్షన్ రెడ్డిని ఉప రాష్ట్రపతిగా మద్దతు ఇవ్వమని కోరారు. దరాబాదీ అయిన న్యాయమూర్తి జస్టిస్ రెడ్డికి ఎంఐఎం మద్దతు ఇస్తుందని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తాను కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపానని ఏఐఎంఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్ లో పేర్కొన్నారు. .