నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు
rajendra prasad's daughter gayatri
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం గాయత్రికి గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మరణించారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గాయత్రి వయసు 38 సంవత్సరాలు.
38 ఏళ్ల కుమార్తె...
దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతి చిన్న వయసులో గుండెపోటు వచ్చి మరణించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. కూతురు అంటే ఎంతో ఇష్టంగా చూసుకునే రాజేంద్ర ప్రసాద్ ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పరామర్శించి సానుభూతిని తెలియచేస్తున్నారు.