మళ్లీ జల్పల్లి నివాసానికి మోహన్ బాబు
సినీనటుడు మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు
సినీనటుడు మోహన్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల క్రితం జల్పల్లిలోని తన నివాసంలో జరిగిన ఘర్షణల తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. బీపీ పెరగడంతో, ఎడమ కంటి వద్ద స్వల్పగాయం అయిందని వైద్యులు తెలిపారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...
అయితే రెండురోజుల పాటు వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత మోహన్ బాబును ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేశాయి. ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా జల్పల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ ఎదుట హాజరు కావాల్సి ఉన్నా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నమోహన్ బాబు తదుపరి కోర్టు ఆదేశాలతో వ్యవహరించనున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు