Mohan Babu : హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటీషన్
సినీనటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు.
mohan babu
సినీనటుడు మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆయన పిటీషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన పిటీషన్ లో కోరారు. మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు వచ్చే అవకాశముంది.
విచారణకు హాజరు కావాలని...
ఈరోజు ఉదయం 10.30 గంటలకు పోలీసు విచారణకు హాజరు కావాలని రాచకొండ కమిషనర్ మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరడంతో ఈరోజు విచారణకు హాజరు కాలేకపోయారు. వైద్యులు కూడా రెండు రోజుల పాటు వైద్యుల సంరక్షణలోనే ఉండాలని చెప్పడంతో ఆయన విచారణకు హాజరు కావడం లేదు