హైదరాబాద్-విజయవాడ హైవే పై వెళ్లే వారికి గుడ్ న్యూస్
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణలో ముందడుగు పడింది.
హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణలో ముందడుగు పడింది. హైదరాబాద్-విజయవాడ NH-65 రహదారి 6 లేన్ల విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టకు సంబంధిచి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రూపొందించే బాధ్యతల్ని మధ్య ప్రదేశక్ చెందిన ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది.
త్వరలోనే విస్తరణ పనులు...
ఈ నెలాఖరుకల్లా ఈ సంస్థతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ఖరారు కానుందని తెలిసింది. డీపీఆర్ తయారీకి రూ.9.86 కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనాలు వేసినట్లు సమాచారం. తెలంగాణలోని దండు మల్కాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గొల్లపూడి వరకు 265 కి.మీ మేర హైవే విస్తరణ పనులు జరగనున్నాయి. ఈ హైవేపై రద్దీ పెరగడంతో దీనిని ఆరులైన్ల రహదారిగా విస్తరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినపడుతుంది.