గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Update: 2023-07-30 12:40 GMT

గుండెపోటుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి 

హైదరాబాద్‌: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. గత కొన్ని నెలలుగా యువకులు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయి గుండె పోటుతో మృతి చెందిన సంఘటనలు జరుగుతూ ఉండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో బస్ స్టాప్, ఫంక్షన్, జిమ్, కాలేజ్ ఇలా వివిధ చోట్ల యువకులు ఒక్కసారిగా కుప్ప కూలిపోయి కిందపడి గుండె పోటుతో మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి సంఘటనే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోకటి చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాష్ రూమ్ కాని వెళ్లి మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ కుటుంబంలో చీకటి చాయలు అలుముకున్నాయి.

రాధే మణి రాజ్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. వాష్ రూమ్ కి వెళ్ళిన రాజ్ ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా రాజ్ కింద పడిపోయి ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే అపార్ట్మెంట్ వాసులు వెంటనే 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది రాదే మణి రాజ్ ను పరిశీలించి అతను అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అతను గుండెపోటుతో మరణించినట్లుగా సిబ్బంది భావించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. రాజ్ మరణంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Tags:    

Similar News