కంటి నుండి ముక్కులోకి కత్తి ముక్క.. ప్రాణాలు కాపాడిన వైద్యులు
కంటి నుంచి ముక్కులోకి చేరిన 4 అంగుళాల కత్తి ముక్కను క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించారు కోఠిలోని ఈఎన్‌టీ వైద్యులు
కంటి నుంచి ముక్కులోకి చేరిన 4 అంగుళాల కత్తి ముక్కను క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించారు కోఠిలోని ఈఎన్‌టీ వైద్యులు వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్‌కు చెందిన జి.రాజేందర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ఎడమ కంటిలో పొడిచాడు. బాధితుణ్ని కుటుంబసభ్యులు సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించగా కంటిలో ఇరుక్కున్న కత్తి ముక్క ముక్కులోకి చేరిందని గుర్తించారు. ఆ తర్వాత కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఆనందాచార్య నేతృత్వంలో సరోజినీదేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ మోదిని, వైద్యులు రవి, ఉమాప్రదీప్, నిఖిల, సౌజన్య, నిహారిక, స్వామి, నర్సింగ్ అధికారి అంజలి బృందం సుమారు రెండు గంటల పాటు శ్రమించి కత్తి ముక్కను తొలగించి ప్రాణాలు కాపాడింది.