Srisailam : శ్రీశైలం వెళ్లేవారికి అలెర్ట్.. రోడ్లపైన వరద నీరు
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారిలో నీరు నిలిచింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే రహదారిలో నీరు నిలిచింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం వెళ్లే రహదారికి వెళ్లే మార్గంలో నీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనేక వాహనాలు నిలిచిపోయాయి. నీరు రహదారి నుంచి తొలిగేంత వరకూ ఎవరూ దిగే ప్రయత్నం చేయవద్దనిఅధికారులు సూచిస్తున్నారు.
వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో..
శ్రీశైలం ప్రధాన రహదారి పై వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. అంచనాకు మించి చంద్రవాగు బ్రిడ్జి పైనుంచి కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతుంది. మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ రహదారిలో వెళ్లేవారు ఈరోజు మానుకోవాలని సూచిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో శ్రీశైలానికి భక్తుల రాక ఎక్కువగా ఉంటుందని భావించి అధికారులు ఈ సూచనలు చేశారు.