ఈడీ విచారణకు హాజరైన మిధున్ రెడ్డి
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మిధున్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిన్న విజయసాయిరెడ్డిని ఇదే కేసులో విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు మిధున్ రెడ్డిని విచారిస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో...
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి సిట్ అధికారులు విచారణ చేశారు. ఈ కేసులో మిధున్ రెడ్డి డెబ్భయి రోజులకు పైగానే రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి పాత్ర, మనీలాండరింగ్ విషయంలో ఆయనను నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు.