Hyderabad : నాలుగు రోజులు మద్యం దుకాణాలు బంద్
హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్. నాలుగు రోజుల పాటు నగరంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.
హైదరాబాదీలకు బ్యాడ్ న్యూస్. నాలుగు రోజుల పాటు నగరంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతుండటంతో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆంక్షలు విధించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని అన్ని బార్లు, మద్యం షాపులు, కల్లుదుకాణాలను, రెస్టారెంట్లను మూసి వేయాలని అధికారులు ఆంక్షలువిధించారు. పోలింగ్ ఈ నెల 11వ తేదీన జరుగుతుంది. పన్నెండో తేదీ వరకూ ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులను తెరిచి ఉంచినా, మద్యం విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అన్ని మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.