Jublee Hills By Election : బీజేపీ అభ్యర్థి.. ఎవరీ దీపక్ రెడ్డి?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. లంకల దీపక్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. లంకల దీపక్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి తొలి నుంచి బీజేపీలో నేతగా కొనసాగుతున్నారు. 2023 ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా లంకల దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు.
తనను గెలిపిస్తే...
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయన గత కొద్ది రోజుల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. చివరకు ఆయన పేరును అధినాయకత్వం ఖరారు చేసింది. మాగంటి గోపీనాధ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే నెల 11వ తేదీన జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తానని లంకల దీపక్ రెడ్డి చెబుతున్నారు.