Jubilee Hills Bye Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రారంభమయింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఎన్నికలను ప్రశాంతంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఐదు వేల మంది పోలింగ్ సిబ్బందిని అధికారులు నియమించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ 14న...
పోలింగ్ కు 17,61 మంది భద్రత సిబ్బందితో పాటు 800 మంది కేంద్ర బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో తొలిసారి డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ఎన్నిక తీరును పరిశీలించనున్నారు. ఇందుకోసం ఫ్లయింగ్ స్వ్కాడ్ లను కూడా ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఈ నెల 14వ తేదీన జరగనుంది