Jubilee Hills Bye Elections : జూబ్లీహిల్స్ లో పోటీ పడుతున్నది వీరే

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో యాభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు

Update: 2025-10-24 11:57 GMT

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో యాభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 81 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లు మాత్రమే స్క్రూటినీలో అర్హత సాధించాయి. అయితే నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియనుండటంతో ఈరోజు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఉప సంహరణ తర్వాత...
వీరంతా స్వతంత్ర అభ్యర్థులే. దీంతో చివరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి సాయిరాం ప్రకటించారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉండనుంది. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నవంబరు 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. నవంబరు 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది.


Tags:    

Similar News