BJP : నేడు దీపక్ రెడ్డి నామినేషన్
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నేడు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నేడు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈరోజు నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో నేడు దాఖలు చేయడానికి దీపక్ రెడ్డి సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ తన పార్టీకి చెందిన అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
బీజేపీ అభ్యర్థిగా...
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈరోజు దీపక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కూడా పాల్గొననున్నారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను దీపక్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి అందచేయనున్నారు.