Jubilee Hills Bye Elections : నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. షేక్ పేట్ డివిజన్ తో మొదలై ఎర్రగడ్డ డివిజన్ తో కౌంటింగ్ ముగియనుంది. ఇప్పటికే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
144వ సెక్షన్ అమలులో...
ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలట్ లెక్కింపు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144వ సెక్షన్ అమలులో ఉంది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తక్కువ శాతం ఓట్లు పోలవ్వడంతో పది గంటలకల్లా ఫలితం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది తేలుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.