మానవ మలంతో మాత్రలు.. ఎందుకోసమంటే?
మానవ శరీరంలోని మలినాలు మలం రూపంలో బయటకు వచ్చేస్తాయి.
మానవ శరీరంలోని మలినాలు మలం రూపంలో బయటకు వచ్చేస్తాయి. అయితే కొన్ని మాత్రం లోపలే తిష్టేసుకుని ఉంటాయి. అలాంటి వాటిని దెబ్బ తీయడానికి మలంతో మాత్రలను తయారు చేశారు సైంటిస్ట్లు.
బ్రిటన్ పరిశోధకులు పేగుల్లో యాంటీబయోటిక్స్‌ను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లను అడ్డుకోవడం కోసం ఈ పిల్స్ ను సరికొత్తగా కనిపెట్టారు. ఈ మాత్రను మానవ మలంతో తయారు చేశారు. వీటికి ‘పూ పిల్స్’ అని పేరు పెట్టారు. ఎండబెట్టి, పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారనుకోండి. మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పూ పిల్స్‌లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్‌బగ్స్‌తో పోరాడి బయటకు పంపుతున్నాయి. పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తున్నాయి.