Nipah Virus : నిఫా వైరస్ సోకిన వారు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. ఇద్దరి మరణంతో హై అలెర్ట్
భారత్ లో్ నిఫా వైరస్ కలకలం రేపుతుంది. కేరళలో ఈ వైరస్ సోకి ఇప్పటి వరకూ ఇద్దరు మరణించారు.
భారత్ లో నిఫా వైరస్ కలకలం రేపుతుంది. కేరళలో ఈ వైరస్ సోకి ఇప్పటి వరకూ ఇద్దరు మరణించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. మలప్పురం చెందిన ఒక వ్యక్తి, పాకల్కాడ్ జిల్లాలో మరొక వ్యక్తి నిఫా వైరస్ తో మరణించారు. ఈ నెల 12వ తేదీన పాలక్కాడ్ జిల్లాలో మరణించిన వ్యక్తికి నిఫా వైరస్ సోకినట్లు మంజేరి మెడికల్ కళాశాలలో జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయిందనిమంత్రి వీణా జార్జి తెలిపారు. అయితే ఈ వ్యక్తితో కాంట్రాక్టు అయిన వ్యక్తులను గుర్తించి వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి.
కాంట్రాక్టు అయిన వ్యక్తి నుంచి...
మొత్తం దాదాపు యాభై మంది వరకూ ఆ వ్యక్తితో కాంట్రాక్టు అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిందరికీ ఐసొలేషన్ లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మరణించిన వ్యక్తి మొబైల్ డేటా ఆధారంగా కాంట్రాక్ట్ అయిన వారి వివరాలను సేకరించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా ఇందులో ఉండటంతో వారందరి రక్త నమూనాలను సేకరించడమే కాకుండా, వారు మరెవ్వరితో కాంట్రాక్టు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వారందరినీ ఐసొలేషన్ కు తరలించాలని నిర్ణయించింది.
ప్రత్యేక బృందాలను నియమించి...
నిఫా వైరస్ మరణాలు రెండింటికి చేరడంతో కేరళ ప్రభుత్వం జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. సాధారణ జ్వరమా? వైరల్ ఫీవరా? లేక మరైదైనా ఇన్ ఫెక్షనా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఆరోగ్య శాఖకు చెందిన ప్రత్యేక బృందాలను నియమించి ఇంటింటికీ తిరిగి జ్వరపీడితులను గుర్తించేపనిలో ఉన్నారు. పాలక్కాడ్, మలప్పురం జిల్లాల్లో ఈ వైరస్ మరణాలున్నందున అక్కడ మాత్రం మరింత అప్రమత్తం చేశారు. ప్రజలు ఖచ్చితంగా బయటకు వస్తే మాస్క్ లు ధరించాల్సిందేనని, బౌతికదూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం ఆ జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసింది. అనవసరంగా ఆసుపత్రుల వద్దకు కూడా రావద్దని తెలిపింది.
ఆరు జిల్లాల్లో హెచ్చరికలు...
కేరళలోని ఆరు జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆసుపత్రికివచ్చినా, బయటకు వెళ్లినా ఈ జిల్లాకు చెందిన వారు ఖచ్చితంగా మాస్క్ లు ధరించి ఉండాలని కోరారు. తీవ్రమైన జ్వరం రావడంతో పాటు దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆరోగ్య శాఖ కు చెందిన కార్యకర్తను సంప్రదించాలని కూడా తెలిపింది. వీలయినంత వరకూ ఈ వ్యాధులున్న వారు బయటకు రాకుండా సమాచారం వస్తే ఇంటికి వచ్చి ఆరోగ్య కార్కకర్తలు పరీక్షలు నిర్వహిస్తారని కూడా తెలిపింది. మొత్తం కేరళలో 543 మంది ఇలాంటి రకమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.