Mosquitoes: మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేయండి వెంటనే పరార్‌..

వేడి రాకతో దోమల బెడద పెరిగింది. వేడి పెరగడంతో ఇంటింటికీ దోమల బెడద పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా దోమల తీరు

Update: 2024-03-21 08:41 GMT

Mosquitoes

వేడి రాకతో దోమల బెడద పెరిగింది. వేడి పెరగడంతో ఇంటింటికీ దోమల బెడద పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా దోమల తీరు కూడా మారిపోయింది. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా నిద్రిస్తున్నప్పుడు దోమ కాటుతో అందరూ బలైపోతుంటారు. దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా అగరబత్తీలను వాడుతుంటారు. మరోవైపు దోమల బెడదతో రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లను నివారించేందుకు ఇంటి వద్దే పలు చర్యలు తీసుకుంటున్నారు. దోమలను తరిమికొట్టకపోతే డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారు. దోమల బెడద నుండి ప్రతి ఒక్కరినీ దూరంగా ఉంచడం ఇప్పుడు మరింత ఆందోళనగా మారింది. దోమల నుంచి దూరంగా ఉండాలంటే ఎలాంటి హోం రెమెడీస్ చేయాలో తెలుసుకోవాలి. దోమలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి లావెండర్ నూనెను సులభంగా ఉపయోగించవచ్చు. ఇంట్లో డిఫ్యూజర్‌గా ఉపయోగించవచ్చు. మీరు దీన్ని లోషన్ లేదా క్రీమ్‌తో మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయవచ్చు.

కర్పూరం దోమలను తరిమికొట్టడానికి సులభమైన మార్గం. కర్పూరపు ఘాటైన వాసన వల్ల దోమలు, ఎలాంటి క్రిమికీటకాలు దగ్గరకు రావు. దోమల బెడద నుండి విముక్తి పొందడానికి మీరు సాయంత్రం కర్పూరాన్ని కాల్చవచ్చు. సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. టీ ట్రీ ఆయిల్ మీ నుండి దోమలు లేదా కీటకాలను దూరంగా ఉంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కోసం, మీరు క్రీమ్ లోషన్ ఉపయోగించవచ్చు.

దోమ కాటు తర్వాత చర్మం దద్దుర్లు లేదా చికాకును వస్తున్నట్లయితే మీరు దాని నుండి ఉపశమనం పొందడానికి ఈ ప్రత్యేక నూనెను ఉపయోగించవచ్చు. ఎరుపు, వాపు త్వరగా తగ్గుతుంది. చికాకు కూడా తగ్గిపోతుంది. నిమ్మగడ్డి, లవంగాలతో ఒక పాత్రలో కొబ్బరి నూనెను వేడి చేయండి. ఇప్పుడు మీరు ఆ నూనెను ఒక సీసాలో ఉంచి ఎక్కువసేపు ఉపయోగించవచ్చు. అవసరమైతే దాన్ని బయటకు తీసి చర్మంపై అప్లై చేయండి. దీని వల్ల దోమలు మీ వద్దకు రావు.

ఇంట్లోకి దోమలు వస్తూనే ఉంటాయి. అప్పుడు మీరు వేప ఆకులను కాల్చి వాటిని ధూపంగా ఉపయోగించవచ్చు. ఫలితంగా దోమలు ఇంట్లో నుంచి సులువుగా బయటికి వస్తాయి. మీరు వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి సారంలో ఉండే సల్ఫర్ దోమలతో సహా వివిధ కీటకాలకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. ఎక్కువ సమయం పాటు వెల్లుల్లి వాసన ఆ ప్రాంతం నుండి వారాలపాటు దోమలను నిరోధిస్తుంది. దీంతో మీరు దోమల మోత లేకుండా హాయిగా ఉండొచ్చు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News